#telugu #gurram #jashuva #gabbilam #kavikokila
Reading
Message to his critics
నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి రూపురే
ఖా కమనీయ వైఖరులు గాంచి భళీభళి యన్నవాడె "మీ
దేకుల?"మన్న ప్రశ్న వెలయించి చివాలున లేచి పోవుచో
బాకున గ్రమ్మినట్లగును పార్ధివ చంద్ర! వచింప సిగ్గగున్.
కులమతాలు గీచుకొన్న గీతల చొచ్చి
పంజరాన కట్టుపడను నేను
నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు
తరుగు లేదు విశ్వనరుడ నేను.
జాషువ - క్రొత్తలోకము
కవి దిగ్గజంబన్నఘనమైన బిరుద మ
ర్పించె నాకుం జెళ్ళపిళ్ళ సుకవి
కవి చక్రవర్తి సత్కవి కోకిలం బన్న
బిరుదాళి శిరమున దురమి కొమ్ము
టేనుంగు మీద నూరేగించి కనకాభి
షేకంబు చేసి యాశీర్వదించి
సకలాంధ్ర సీమంబు సన్మానంబులు చేసె
వేలు వేల్ విశ్వ విద్యాలయాలు
సుకవిగా గ్రంధ కర్తగా సుప్రతిష్ఠ
.................................
గవ్వకుసాటిరాని పలుగాకుల మూకలసూయచేత న
న్నెవ్విధి దూరినన్, నను వరించిన శారద లేచిపోవునే?
ఇవ్వసుధాస్థలిన్ బొడమరే రసలుబ్ధులు, ఘంటమూనెదన్
రవ్వలురాల్చెదన్, గరగరల్ సవరించెద నాంధ్రవాణికిన్.
పురుషుల్ నిర్మితిచేయు సాంఘిక మహాభూతంబు పెంగోరలం
దిరికింపంబడి దుష్టభర్తల కృపాహీన ప్రవృత్తుల్ హృదం
తరమున్ ఱంపపుకోతగోయు నిజ హత్యా నేరముల్ చేయు సుం
దరుల న్నీ వెటులూరడింతువొ మహాత్మా ! ప్రేమవారాన్నిధీ
ఫిరదౌసి
“ఒక్కొక పద్దియంబునకు నొక్కొ. క నెత్తురు బొట్లు మేనిలో
దక్కువగా రచించితి, వృథాశ్రమయయ్య(, గులీనుడె న రా
జిక్క-రణిన్ మృషల్వలుకునే ? కవితా బుణ మీయకుండునే
నిక్క. మెటుంగ నైతి గజనీసులతాను మహమ్మ ద(గణి!” (పు-17,18)
'రాజు మరణించే నొక తారరాలిపోయే
కవియు మరణించే నొక తార గగనమెక్కె
రాజు జీవించే రాతి విగ్రహములందు
సుకవి జీవించే ప్రజల నాల్కలయందు'' (ఫిరదౌసి)
విత్తనంబున మహా వృక్షఁబు నిమిడించి
సృష్టించి గారడీ సేయువాఁడ
కడుపులో శిశువును గల్పించి పదినెలల్
మోయించి యూపిరి వోయువాఁడ
సద్భక్త వరులకు సాక్షాత్కరించియు
నున్న చోటెరిగింప కున్న వాఁడ
పొటమరింపక ముందె పుష్ప సంతతులకు
వింతగా రంగులు వేయువాడ
ఇంత అందమైన,అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించి,అనుభవించండని,ఆనందించండని నరులకిచ్చిన, ఓదేవదేవా!.నీవు మాత్రము నిలువనీడలేకుండ వున్నావు కదా!నాకు జన్మనిచ్చిన ఈశ్వరా.
చెలువ మొప్పఁ బుడమి సృష్టించి మాకిచ్చి
అనుభవింపుఁ డనుచు నానతిచ్చి
నిలువ నీడలేక నిల్చిన వాఁడ!
కడుపునిండ నన్నుఁ గన్నవాడ
పాపాయి పద్యములు
Alternative Audio link with lyrics.
బొటవ్రేల ముల్లోకములు జూపి లోలోన
ఆనందపడు నోరు లేని యోగి
తల్లిదండ్రుల తనూవల్లరి ద్వయికి వ
న్నియబెట్టు తొమ్మిది నెలల పంట
అమృతమ్ము విషమను వ్యత్యాసమెరుగ
కాస్వాదించ చను వెర్రిబాగులాడు
యనుభవించు కొలంది యినుమడించుచు మరం
దము జాలువారు చైతన్యఫలము
భాషరాదు, వట్టి బాలు మాత్రమె త్రాగు
నిద్రపోవు, లేచి నిలువలేడు,
ఎవ్వరెరుగ రితని దే దేశమో గాని
మొన్న మొన్న నిలకు మొలచినాడు
నవమాసములు భోజనము నీర మెఱుగక
పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి జిమ్ము జానెడు బొట్టలో
నిద్రించి లేచిన నిర్గుణుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార
లన్నంబుగా దెచ్చుకొన్న యతిధి
నును జెక్కిలుల బోసినోటి నవ్వులలోన
ముద్దులు జిత్రించు మోహనుండు
బట్టగట్టడు, బిడియాన బట్టు వడడు,
ధారుణీ పాఠశాలలలో జేరె కాని
వారమాయెనొ లేదొ మా ప్రకృతి కాంత
తరపి యున్నవి వీని గాకలియు నిద్ర
గానమాలింపక కన్నుమూయని రాజు
అమ్మ కౌగిటి పంజరంపు చిలుక
పొడవు కండలు పేరుకొను పిల్ల వస్తాదు
ఊయేల దిగని భాగ్యోన్నతుండు
ఊ ఊ లు నేర్చిన యొక వింత చదువరి,
సతిని ముట్టని నాటి సాంబ మూర్తి
రసవబ్ధి తరియింప వచ్చిన పరదేశి
తన యింటి కొత్త పెత్తనపు ధారి
ఏమి పని మీద భూమికి నేగినాడొ
నుడువ నేర్చిన పిమ్మట నడగవలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొ గాని
యిప్పటికి మాత్రమేపాప మెఱుగడితడు
ఊయేల తొట్టి యేముపదేశమిచ్చునో
కొసరి యొంటరిగ నూ కొట్టు గొనును
అమ్మతో తనకేమి సంబంధమున్నదో
యేడ్చి యూడిగము జేయించుకొనును
పరమేశ్వరుండేమి సరసంబులాడునో
బిట్టుగా గేకిసల్ కొట్టుకొనును
మూన్నాళ్ళలోనె ఎప్పుడు నేర్చుకొనియెనో
బొమ్మన్నచో చిన్న బుచ్చుకొనును
ముక్కు పచ్చలారిపోయి ప్రాయము వచ్చి
చదువు సంధ్య నేర్చి బ్రతుకు నపుడు
నాదు పసిడి కొండ నారత్నమని తల్లి
పలుకు, పలుకులితడు నిలుపుగాక
గబ్బిలం
చిక్కినకాసుచేఁ దనివిఁ జెందు నమాయకుడెల్ల కష్టముల్
బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి న
ల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న యరుంధతీ సుతుం
డొక్కడు జన్మమెత్తె భరతోర్వరకుం గడగట్టు బిడ్డడై
పూపవయస్సులో వలసపోయిన చక్కని తెల్గు కైతకున్
బ్రాపక మిచ్చినట్టి రఘునాథనృపాలకుఁ డేలియున్న తం
జాపురి మండలంబునకుఁ జక్కగ దక్షిణభాగ భుములన్
గాపురముండె నప్పరమ గర్భదరిద్రుఁడు నీతిమంతుడై
ముప్పు ఘటించి వీని గలిమిన్ గబళించి దేహమున్
బిప్పి యొనర్చు నీ భరత వీరుని పాదము కందుకుండగా
జెప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింప లే
దెప్పుడు నప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకున్
వాని ఱెక్కలు కష్టంబు లేనినాఁడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనముఁ బెట్టు వానికి భుక్తి లేదు
వాని తలమీదబులిమిన పంకిలమును
గడిగి కరుణింపలేదయ్య గగనగంగ
వాని నైవేద్యమున నంటు వడిన నాఁడు
మూఁడు మూర్తులకును గూడఁ గూడు లేదు
పామునకుఁ బాలు చీమకుఁ బంచదార
మేపు కొనుచున్న కర్మభూమిఁ జనించు
ప్రాక్తనం బైన ధర్మదేవతకుఁ గూడ
నులికిపడు జబ్బు గలదు వీఁడున్న చోట
వాని నుధ్ధరించు భగవంతుఁడే లేఁడు
మనుజుఁ డెట్లు వాని గనికరించు
వాఁడు జేసుకొన్న పాపకారణమేమొ
యింతవఱకు వాని కెఱుకలేదు
ఆ అభాగ్యుని రక్తంబు నాహరించి
యినుప గజ్జెల తల్లి జీవనము సేయుఁ
గసరి బుసకొట్టు నాతని గాలిసోఁక
నాల్గు పడగల హైందవ నాగరాజు
కులములేని నేను కొడుకులఁ బుట్టించి
యీ అఖాతమందె త్రోయవలెనె
భార్యయేలఁ బుట్టుబానిసకని వాఁడు
జరుపసాఁగె బ్రహ్మచర్య దీక్ష
ఉదయమాది రక్త మోడ్చికష్టముఁజేసి
యినుని సాగనొంపి యిల్లు సేరి
యున్న గంజిఁద్రావి యొక్కనాఁడాపేద
ప్రక్కమీద మేను వాల్చియుండె
ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలె
విహారము సేయసాఁగె గబ్బిలమొకండు
దాని పక్షానిలంబున వాని చిన్న
యాముదపు దీప మల్లన నాఱిపోయె
ప్రతిమల దేవతాభవన్ వాసముచేయుచు మమ్మువాంటి మా
నవులకు లేని గౌరవమునం దులదూగెడు గబ్బిలాల రా
ణివిగద నీవు స్వాగతము నీకు శుభంబకదమ్మ నీతనూ
భవులకుఁ దల్లక్రిందుల తపంబులకున్ గుడి గోపురాలకున్
ప్రతిమలపెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించుఁగాని దుః
ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్ప దీ భరతమేదిని ముప్పదిమూడుకోట్ల దే
వత లెగవడ్డ దేశమున భాగ్యహీనుల క్షుత్తులాఱునే
పరమార్థంబులు బోధసేయుదురు లోభ స్వాంతులై నిత్యమున్
గురువుల్ ముక్కుకుసూటిగాఁదగులు యుక్తుల్పన్ని కైవల్యపుం
దెరువుల్సూపి మహాపరాధివనుచున్ దీర్మానముల్ సేయుచుం
దురు వేదాంతరథంబు సాగదనుకొందున్ నేను లేకుండినన్
కర్మసిధ్ధాంతమున నోరు కట్టివేసి
స్వార్థలోలురు నాభుక్తి ననుభవింత్రు
కర్మమననేమొ దాని కీకక్ష యేమొ
యీశ్వరునిచేత ఋజువు చేయింపవమ్మ
ఆలయంబున నీవు వ్రేలాడువేళ
శివుని చెవి నీకుఁ గొంత చేరువుగ నుండు
మౌని ఖగరాజ్ఞి, పూజారి లేనివేళ
విన్న వింపుము నాదు జీవిత చరిత్ర
స్వార్థమున నిన్నుఁ గొఱముట్టువలె గణింపఁ
గడుపునిండిన భాగ్యవంతుడను గాను
దోషములు సూపి నీకు నీతులు వచించి
దొరతనము సేయఁగా మతస్థుఁడను గాను
ధర్మమునకుఁ బిరికితన మెన్నఁడును లేదు
సత్యవక్యమునకుఁ జావు లేదు
వెఱవనేల నీకు విశ్వనాథుని మ్రోల
సృష్టికర్త తాను సృష్టి నీవు
బిడ్డల గని పాలిచ్చెడు
దొడ్డతనంబున్న పుల్గు దొరసానివి నా
కడ్డుపడ దిగిన వేలుపు
గిడ్డివి నా మనవి నాలకించెవు గదా
పక్షిసుందరి నీ చిన్న కుక్షి నిండ
నిన్ని నీరంబుఁ బలహార మున్నఁ జాలు
నెన్ని దేశాలు తిరిగిన నేమి నీకు
నీవు నావలెఁ బుట్టుబానిసవు కావు
కృష్ణరాయలవారి యెడబాటు చీకట్లు
ముసరి దిక్కులలోన మసలువేళ
భూరి వాఙ్మయలక్ష్మి దారిబత్తెముతోడఁ
దంజాపురమువంకఁదరులు వేళఁ
వేంకతకవి తెల్గు పంకేరుహాక్షికి
శ్లేషోక్తు లలవాటు సేయువేళ
బచ్చపచ్చని ముద్దుపళని ముద్దులకైత
శృంగార రసము వర్షించు వేళ
మువ్వగోపల దేవుని పూజసేయ
ఘనుడు క్షేత్రయ కలమందుకొనినవేళ
నపరరాయలు రఘునాథ నృపతి విభుఁడు
కట్టుకొన్నాఁడు సత్కీర్తి కుట్టిమంబు
యతియుంబ్రాసయులేని సంస్కృత కవితారణ్యమఅందున్న భా
రతవేదానఁ బదేనుపర్వముల కాంధ్రత్వంబు నేర్పించి శా
శ్వతుడై పోయిన తిక్కయజ్వకు నివాసంబైన నెల్లూరికిన్
నతులర్పింపుము స్నానమాడు మతి గణ్యంబైన పెన్నానదిన్
మణిమయంబైన యాంధ్రసామ్రాజ్య రథము
భువికిఁ గ్రుంగిన పదియునాఱవ శతాబ్దిఁ
గృష్ణవిభు వీటఁ బ్రొద్దు గ్రుంకినది మొదలు
ఋషిఖగాంగన తెల్లవారినది లేదు
గిజిగాడు
తేలిక గడ్డిపోచలను దెచ్చి, రచించెద వీవు తూఁగుటు
య్యేలగృహంబు మానవుల కేరికి సాధ్యము గాదు దానిలో
జాలరు లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా
మేలు భళీ! పులుంగుటెకిమీడవురా! గిజిగాడ నీడ