శ్రీ కృష్ణ దేవరాయ + తెనాలి రామకృష్ణ
#తెలుగు #telugu #telugupoetry #krishnadevaraya #tenaliramakrishna #teluguliterature #telugupadyam #పద్యం
శ్రీ కృష్ణ దేవరాయలు తన తెలుగు భాషాభిమానాన్ని ఇలా వివరించారు. “దేశ భాషలందు తెలుగు లెస్స” ఎందుకంటే-
“తెలుఁ గ దేల? యన్న, (1) దేశంబు తెలుఁగు; (2) ఏను తెలుఁగు వల్లభుండ; (3) తెలుఁగొ కండ; (4) ఎల్ల నృపులు గొలువ నెఱుఁగవే బాసాడి, దేశభాషలందుఁ దెలుఁగు లెస్స.” అని – తానున్నది తెలుగు దేశం, తాను తెలుగు రాయలు, తెలుగు భాష మధురాతిమధురం, దేశభాషలలో తెలుగు లెస్స అని సర్వరాజన్యులు భాషిస్తుండగా నీకు మాత్రం తెలియలేదా?
ఒకసారి తెనాలి రామకృష్ణుడు లేని సమయంలో శ్రీ కృష్ణ దేవరాయలు "కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్" అనే సమస్యను పూరణకివ్వగా, సభలో ఎవ్వరూ పూరించలేకపొయారు. అది తెనాలి రామలింగడు ఎలా పూరిస్తాడా అని రాజగురువు తాతాచార్యులవారు అదే సమస్యని ఒక ద్వారపాలకుడితో అడిగిస్తాడు. దానికి తెనాలి రామలింగడి పూరణః
గంజాయి త్రాగి తురకల
సంజాతల గూడి కల్లు చవిగొన్నావా?
లంజల కొడకా! ఎచ్చట
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్
అదే సమస్యని రామలింగ కవి శ్రీ కృష్ణ దేవరయల సమక్షంలో పూరించిన విధం:
రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు గొల్వ పాల్పడిరకటా!
సంజయ! విధి నేమందును
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్
ధూర్జటి కవి యొక్క కవిత్వ పటిమకు ఆశ్చర్య పడిన కృష్ణదేవరాయల వారు ఇలా అన్నారు.
Question by Krishnadevaraya - చంపకమాల సమస్య 1.5 lines
“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ
యతులితమాధురీమహిమ?”
Answer by ramakrishna - 2.5 lines
“… హా! తెలిసెన్; భువనైకమోహనో
ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం
తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.”
హా! తెలిసెన్ = అసలు సంగతి తెలిసిందండోయి! అని భావం. ఏమి తెలిసిందో చెప్పబోయే ఆ ఉదంతానికి “హా!” అన్న ప్రతిపదోక్తం ఆశ్చర్యార్థకంగానూ, ఆక్షేపసూచకంగానూ అమరింది.
భువన+ఏక = పధ్నాలుగు భువనాలను ఒక్క తీరున, మోహన = సమ్మోహింపజేసే; ఉద్ధత = ఔద్ధత్యాన్ని వహించిన (గర్వాన్ని కలిగిన); సుకుమార = కోమలులైన, వారవనితా+జనతా = వేశ్యకాంతలయొక్క, ఘన = విరహిజనుల అధికతరమైన, తాపహారి = మన్మథతాపార్తిని హరింపజేసే, సంతత+మధుర = నిత్యమధురమైన, అధర+ఉదిత = క్రిందిపెదవినుంచి ఉట్టిపడే, సుధారసధారలు = అమృతరసప్రవాహాలను; క్రోలుటన్+చుమీ = ఆస్వాదించటం వల్లనే సుమండీ! అని రాయలవారి ప్రశ్నకు సమాధానం.
“వారవనితాజనతా ఘనతా+అపహారి” అన్న విరుపులో వారవనితలకు అంతకాలం ఉన్న పరువు కూడా ధూర్జటి వాళ్ళ ఇంటికి వెళుతుండటం వల్ల తొలగిపోతుందనే వెక్కిరింత లేకపోలేదు. అదీ వ్యంగ్యార్థంలో భాగమే కాని, రామకృష్ణకవికి అనభిమతార్థం కాదు.
కృష్ణదేవరాయల వారి ఆస్థానం లో కవుల పాండిత్య పోటీ లో, ఒక కవి ఈ సమస్యని అష్టదిగ్గజ కవులకు సంధించి అర్థం చెప్పమంటాడు.
రాజనందన రాజ రాజత్మజుల
సాటి తలప నల్లయ వేమ ధరణి పతికి
భవభవ భోగ సత్కళా భావములను
భావభవ భోగ సత్కళా భావములను
అప్పుడు తెనాలి రామకృష్ణుడు మరో సమస్యని అతనికి ఇస్తాడు.
సీ: మేకతోకకు మేక తోక మేకకు తోక మేక తోకా మేక మేక తోకా
మేకతోకకు మేక తోక మేకకు తోక మేక తోకా మేక మేక తోకా
మేకతోకకు మేక తోక మేకకు తోక మేక తోకా మేక మేక తోకా
మేకతోకకు మేక తోక మేకకు తోక మేక తోకా మేక మేక తోకా
గీ: మేక తొకతోక మెకమేక తోకమేక
మేక తొకతోక మెకమేక తోకమేక
మేక తొకతోక మెకమేక తోకమేక
మేక తొకతోక మెకమేక తోకమేక
A possible explanation to the riddle is shown below.1
Another artist who claimed that he could write anything as quickly as it is dictated by a person enters the court of Sri Krishnadevaraya. In this context, Tenali ramakrishna poses him the following problem, which contains unconventional vocals that are hard to be scripted in text.
త్పృవ్వట బాబా .....
తల పై పువ్వట జాబిల్లి...
వల్వ బూదెట ...
చేదే బువ్వట...
చూడగ ళుళుళుక్కవ్వట...
అరయంగనట్టి హరునకు జేజే...
More Puzzles from the movie Tenali ramakrishna.
Q. A father's will after his death regarding how his 17 elephants are to be divided among his three sons. Eldest son receives half of the elephants, The middle one receives 1/3 of the elephants and the youngest receives 1/3 of what the middle one receives. How to divide them without any animal violence?
Solution: Let us bring a guest elephant. Now total is 18. Half i.e 9 goes to the first. 1/3rd i.e 6 to the second. 1/3 of the second i.e 2 goes to third. The guest elephant is sent back
Note: Though this is mathematically incorrect, it is still funny for the times and mathematical abilities they possessed.

