Rx100 లక్ష్మణ్ పద్యాలు
హంస దౌత్యం, శ్రీ కృష్ణ రాయబారం, తెలుగు భాష మీద అభిమానం, హరిశ్చంద్ర నాటకం, శ్రీనాథ కవి పాండిత్యం
#srinatha #kavisaarvabhouma #harischandra #kaatiscene #hamsadoutyam #naladamayanti #telugu #padyam #kavitvam #rx100 #laxman #srinathudu
శ్రీనాథుడు తన శృంగార నైషధంలో చక్కగా హంస దౌత్యం చేశాడు. నలునికి-దమయంతీకీ మధ్య హంస రాయబారం నిర్వహించి, వారి మనుగడకు ఎంతో కృషిచేసిందని చక్కటి వర్ణనతో రచించాడు.
నళిన సంభవు వాహనము వారువంబులు, కులము సాములు మాకు కువలయాక్షి
చదలేటి బంగారు జలరుహంబుల తూండ్లు భోజనంబులు మాకు పువ్వుబోణి
సత్య లోకముదాక, సకల లోకంబులు ఆటపట్టులు మాకు అబ్జవదన
మధురాక్షరము లైన మా మాటలు వినంగ అమృతాంధశులె యోగ్యులు అనుపమాంగి
భారతీదేవి ముంజేతి పలుకు చిలుక
సమద గజయాన సద్బ్రహ్మచారి మాకు
వేద శాస్త్ర పురాణాది విద్యలెల్ల
తరుణీ, నీ యాన ఘంటా పథమ్ము మాకు!!
Explanation
కలువ వంటి నేత్రాలుగల దమయంతీ! బ్రహ్మ తబేలాలోని గుఱ్ఱాలు (హంసలు) మాకు వంశకర్తలు,
పువ్వు వంటి మేనుగలయో దమయంతీ! ఆకాశగంగ పసిడి తామరల నాళములు మా మేనులు!
ఓ కమలముఖీ! బ్రహ్మ నివాసమయిన సత్యలోకము. చతుర్ధశ భువనాలు మా విహార స్థానాలు.
సాటిలేని మేను గలదానా! తియ్యని అక్షరములు గలవి అమృతాహారులైన దేవతల మాటలు అమృతం వంటివి. వాగీశ్వర వాహనములు గావున వాక్పటిమగలవి.
మదపుతేనుగుల నడక వంటి నడక కలదాన! సరస్వతీదేవి సహధ్యాయి మాకు.
ఓ జవరాల. వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల రాజమార్గము మాకు.
నేను అబద్ధం ఆడను. ఏ త్రాళ్లకు లొంగను. సుగుణాలనే త్రాళ్లకు లొంగుతాను. భూలోకంలో నృప ముఖ్యులలో కొందరితో స్నేహం ఉంది. అందులోనూ నిషద దేశాదీశ్వరుడు నలుడన్న రాజుమీద ఎక్కువ పక్షపాతం కలిగి ఉంటా ను,
అని దమయంతికి నలుని గురించి రాయబారం చేసి చెపుతుంది.
అక్షరాక్షరమందు ఆ సరస్వతి రూపు ప్రత్యక్షమొనరించు ప్రథమ భాష ,
నన్నయాదులనుండి నవ యువ కవి దాకా ఆత్మశక్తిని గూర్చు అమృత భాష,
ఆర్తితో, భక్తితో, ఆర్ద్రతన్ పాడగా, రాగానుకూలమౌ రమ్య భాష ,
గొడ్లకాపరి కూడ గొంతెత్తి కోయిలై పద్యమాలపించు హృద్య భాష,
వెలయ త్యాగయ్య కృతులలో వెన్నపూస,
విభుడు శ్రీకృష్ణ రాయల విజయ ఘోష ,
జగతి ఏదైనా సాధించు జనుల శ్వాస ,
దివ్యవేదాల పనస ….నా తెలుగు భాష
రచయిత: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
శ్రీనాథ కవిసార్వభౌమ
వచియింతు వేములవాడ భీమన భంగి నుద్దండ లీల నొక్కొక్కమాటు;
భాషింతు నన్నయభట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్కమాటు;
వాక్రుత్తు తిక్కయజ్వ ప్రకారము రసాభ్యుచితబంధముగ నొక్కొక్కమాటు;
పరిఢవింతు ప్రబంధపరమేశ్వరుని ట్టేవ సూక్తివైచిత్రి నొక్కొక్కమాటుప్రౌఢి పరికింప సంస్కృత భాష యండ్రు
పలుకు నుడిగారము ఆంధ్ర భాష యండ్రు,
ఎవ్వరేమనుకున్న నాకేమి కొరత,
నా కవిత్వము నిజము కర్ణాట భాష
సత్య హరిశ్చంద్ర అడవి సీను
దేవి...!! రాణివాసంబు భోగంబులు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోరారణ్యమున కీర్తితెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి తీర్థయాత్రలచే నలగింప చేసిన నన్ను నేనేమని నిందించుకుందును ప్రేయసి!
ఏనాడు....!!! నడచినావు ఈ ఎడారులలోన...!! సలలిత...సలలిత ఆ రామ సీమలనేగాన్నీ...!!
ఏనాడు....ఏనాడు....!! తలచూపితివి ప్రచండపుటెండకు అలఘుమాణిక్య కాంతులకే గానీ...!!
ఏనాడు చవిచూచితివి కందమూలముల్ సరసరాజాన్న భోజనమే కానీ...
ఏనాడు...!!! చవిజేర్చితివి క్రూరమృగాదుల్ లీలా సుఖాలాప పాలిగానీ....
కటకటా...కటకటా.... యెన్నడెఱిగితుత్కట దినేశ ఖర కిరణ జాల తప్తకర్కశ శిలాద్రి కటక గమన శ్రమోధ్బూత చటుల చింత నను వరించిట జేసి యీనాడెకాని
ఏనాడు నడచినావు ఈ ఎడారులలోన....!!
శ్రీ కృష్ణ రాయబారం
చెల్లియొ చెల్లకో, తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్
తొల్లి, గతించె, నేడు నను దూతగ బంపిరి సంధిసేయ నీ
పిల్లలు పాపలున్ బ్రజలు బెంపువహింపగ సంధి సేసెదో
ఎల్లి రణంబెగూర్చెదవొ ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా!
Sources
http://www.andhrabhoomi.net/content/sub-feature-904